గృహ నిర్భంధం విధించడం ఏంటి…నిమ్మగడ్డ పై ఎమ్మెల్యే వంశీ ఫైర్

Sunday, February 7th, 2021, 11:00:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పిచ్చి ముదిరింది అని, నియంతృత్వ పోకడలకి పోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ, గృహ నిర్భంధం విధించడం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే విచారణ జరపకుండా అనామకుల కంప్లైంట్స్ పై ఎలా స్పందిస్తారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నిలదీశారు. చంద్రబాబు నాయుడు చెప్పగానే చర్యలు తీసుకుంటారా అంటూ మండిపడ్డారు. అయితే ఎన్నికల కమిషనర్ చర్యలకు అన్నీ సరిపెడతాం అని, ఏక గ్రేవాలు అనేవి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం నుండే ఉన్నాయి అని వంశీ గుర్తు చేశారు. అంతేకాక ఏక గ్రీవాలకి ప్రోత్సాహకాల జీఓ ఇచ్చింది కూడా చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజే కొత్తగా ఏక గ్రివాలు జరుగుతున్నట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ ఏక గ్రీవాలు కూడా బలవంతమేనా అంటూ ప్రశ్నించారు. అయితే గన్నవరం నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.