చంద్రబాబు పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

Thursday, August 20th, 2020, 01:14:17 AM IST


చంద్రబాబు నాయుడు పై మరొకసారి వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీనా వచ్చిన 5 నెలల్లో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఏపీ లో ఉన్నారు అని, అలాంటి పనిలేని బాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని దిమ్మ తిరిగే ప్రశ్న విసిరారు. జూమ్ లో మాట్లాడుతున్నారు అని, మానసిక భ్రాంతి తో తన ఫోన్ ట్యాప్ అయింది అని అంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే రమేష్ ఆసుపత్రి లో ప్రమాదం జరిగినపుడు చర్యలు చేపట్టడం కి తప్పు ఏముంది అని నిలదీశారు. తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది అని అన్నారు.

అయితే ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ లో లేఖరు రాసిన విషయం ను గుర్తు చేశారు. తప్పు చేయని రమేష్ పారిపోవల్సిన అవసరం ఏముంది అని అన్నారు. తెలంగాణ లో తప్పులు చేస్తే సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు అని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లో జాతీయ పార్టీ వాళ్ళుగా ఎందుకు తెలంగాణ లో మాట్లాడరు అని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ను భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు తయారు అయ్యారు అని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు మాత్రం కులం రంగు పూస్తున్నాడు అని, చట్టం ముందు అందరూ సమానులే అని వంశీ అన్నారు.