చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ..!

Monday, September 7th, 2020, 09:28:53 PM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన వంశీ 30 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ అందేలా శ్రీకారం చుట్టారని దీనిపై టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా లోకేశ్‌లా మాట్లాడుతున్నారని, ఆయన మాటలు చూస్తుంటే మతి భ్రమించేదేమో అనిపిస్తుందని అన్నారు.

ఇక ఆయన కొడుకు నారా లోకేశ్ ఏమో గేరు వెయ్యలేక పోతున్నారు, ఎక్సలేటర్ తొక్కలేకపోతున్నారని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని, ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఉచిత విద్యుత్ వ్యవసాయాన్ని బతికించిందని అన్నారు. వైఎస్ మరణం తర్వాత ఉచిత కరంట్ పథకానికి తూట్లు పడిందని, అందుకే 30 ఏళ్ళ పాటు రైతులకు ఇబ్బంది ఉండకూడదని జగన్ కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారని పెన్షన్లు, జీతాలు వచ్చినట్టే ఉచిత కరెంట్ డబ్బులు కూడా రైతుల అకౌంట్‌లో జమ అవుతాయని అన్నారు.