పనికిమాలిన కబుర్లు చెబుతున్నారు.. చంద్రబాబుపై వల్లభనేని వంశీ కామెంట్స్..!

Saturday, December 19th, 2020, 08:22:12 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష స్థానానికి పడిపోయినా పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని అన్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని, తాము జాతీయ నాయకులమై తండ్రీ కొడుకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారని అసలు టీడీపీ జాతీయ పార్టీ అని ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు.

ఆయన బినామీల భూములను కాపాడుకునేందుకు, స్వార్ధం కోసమే రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారని దీనిని రైతులు గ్రహించాలని అన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని వల్లభనేని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, జగన్ పాలన చూసి చంద్రబాబు నేర్చుకోవాలని రాజకీయ అనుభవం ఒక్కటే ఉంటే చాలదని ప్రజల కష్టాలు తీర్చడంలో అనుభవం ఉండాలని చంద్రబాబుకు వలభనేని సూచించారు.