రాజీనామాకు సిద్దం అంటున్న వల్లభనేని వంశీ.. కానీ..!

Monday, August 3rd, 2020, 07:12:26 AM IST

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి వల్లభనేని వంశీ ఇంకా అధికార పార్టీ వైసీపీలో చేరలేదు. ఎందకంటే వైసీపీలో చేరాలంటే ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని జగన్ ఖరాఖండీగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే వల్లభనేని తన పదవి రాజీనామాపై ఓ క్లారిటీ ఇచ్చారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని, కరోనా కారణంగా ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగే పరిస్థితులు లేని కారణంగా రాజీనామా చేయకుండా ఉన్నానని అన్నారు. ఉప ఎన్నిక ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసిన తనకు సమ్మతమేనని స్పష్టం చేశాడు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని, అలా చేయకపోతే తెలంగాణ మాదిరిగా అసమానతలు వచ్చే ప్రమాదముందని అన్నారు.