లోకేశ్ కోసమే చంద్రబాబు టీడీపీనీ భ్రష్టు పట్టించాడు – వల్లభనేని వంశీ

Friday, February 19th, 2021, 09:25:01 PM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో గెలవలేక మైండ్ పోయి తిరుగుతున్న కొడుకు లోకేష్ కోసం చంద్రబబు పార్టీని భ్రష్టు పట్టించాడని అన్నారు. అంతేకాదు టీడీపీ ఒకప్పుడు గొప్ప పార్టీ అని చంద్రబాబు ఆలోచనా విధానాల వలనే ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిందని అన్నారు.

అయితే వయసురీత్యా ఇబ్బందిపడుతున్న ఆయన ప్రజల తిరస్కారాన్ని జీర్ణించుకోలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓడిపోయిన వాళ్ళు ఓటమికి వంద కారణాలు చెబుతారన్నట్టు చంద్రబాబు కూడా ఆ కోవకు చెందినవారే అని అన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొందరు పొగడ్తలు కురిపిస్తున్నారని వాటిని చూసి చంద్రబాబు మురిసి పోతున్నారని అన్నారు.