వకీల్ సాబ్ వచ్చేది అప్పుడేనా?

Wednesday, December 30th, 2020, 05:34:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం విడుదల పై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ చిత్రం 2020 లో నే విడుదల కావాల్సి ఉండగా, కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే సమ్మర్ లో భారీగా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజ్ సైతం ఉగాది కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుండటం, అభిమానులకు కాస్త సంతోషం కలిగించే అంశం అని చెప్పాలి. ఈ చిత్రం మాత్రమే కాకుండా, వరుస సినిమాలు ఒప్పుకుంటూ పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నారు. ఒక పక్క రాజకీయాల్లో తన కార్యక్రమాలు చూసుకుంటూనే, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ బ్యాలన్స్ చేస్తున్నారు.