హాట్ టాపిక్: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Thursday, December 17th, 2020, 12:16:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరున పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాల కారణంగా ఏప్రిల్ 9, 2021 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా షూటింగ్ తో పాటుగా, విడుదల కూడా ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గినా ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఏప్రిల్ వరకూ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గే అవకాశం ఉండటం తో ఈ చిత్రం విడుదల అప్పటికి ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కి క్రాక్ మరియు రెడ్ సినిమా లతో పాటుగా పలు చిత్రాలు థియేటర్ల లో సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. అనంతరం ఈ సమ్మర్ ను వకీల్ సాబ్ గట్టిగా ఉపయోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడం తో ఎక్కువ ధియేటర్ లలో విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.