హాట్ టాపిక్: రాజమౌళి “ఛత్రపతి” ను బాలీవుడ్ లో డైరెక్ట్ చేయనున్న వి.వి.వినాయక్

Friday, November 27th, 2020, 12:41:37 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతి ఒక్క చిత్రం కూడా ఒక మైలు రాయిగా నిలిచి పోయాయి. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఛత్రపతి చిత్రం తో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అందుకు ఒక విధంగా రాజమౌళి కారణం అని చెప్పాలి. అయితే ఇదే సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరో గా మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నారు. అయితే బాలీవుడ్ లో ఈ చిత్రం తో బెల్లంకొండ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ను డైరెక్ట్ చేసిన వినాయక్ మరొకసారి డైరెక్ట్ చేయనున్నాడు. అయితే రాజమౌళి చిత్రాలను పలువురు రీమేక్ చేసినప్పటికీ, ఒక తెలుగు డైరెక్టర్ ఇప్పటి వరకు అలాంటి సాహసాలు చేయలేదు. అయితే ఒక రాజమౌళి సినిమాను ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ చేసేందుకు సిద్దం కావడం తో ఫిల్మ్ నగర్ లో దీని పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడటంతో వివి వినాయక్ స్టైల్ లో ఎలా ఉంటుందో అంటూ పలువరు అంటున్నారు.