రైతు కుటుంబానికి సాయం చేసిన వీహెచ్.. కేసీఆర్ ఇలాఖాలోనే..!

Sunday, August 2nd, 2020, 01:31:18 AM IST


కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు నోటి మాట ఎంత గట్టిగా ఉన్నా మనసు మాత్రం దయాహృదయం కలదనే చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఓ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు.

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం, వేలూరు గ్రామానికి చెందిన బ్యాగారి నర్సింహులుకు చెందిన 13 గుంటల భూమిని లాకొన్ని అందులో రైతు వేదికను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ నర్సింహులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై చలించిన వీహెచ్ నేడు నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీహెచ్ కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి ఇల్లా పేద దళితులకు చెందిన భూమిని ఇలా లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాదు నర్సింహులు కుటుంబానికి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.