షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Friday, April 9th, 2021, 05:38:24 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ ఏర్పాటు చేయబోతున్న షర్మిల నేడు ఖమ్మంలో భారీ బహిరంగ ఏర్పాటు చేసి పార్టీ పేరును, పార్టీ విధివిధానాలను ప్రకటించబోతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు మాత్రమే అంతకు మించి ఏమీ లేదని అన్నారు. కరోనాతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు అని డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు. మేము ఎక్కడికి వెళ్లినా అనుమతులు ఇవ్వరని, వాళ్లకోక న్యాయం మాకొక న్యాయమా? ఈ విషయం పై మానేతలు కూడా నోరు విప్పి మాట్లాడాలని అన్నారు.

అయితే బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణలో ఉండే ఆంధ్రా ఓట్లను కొల్లగొట్టడానికి షర్మిలతో ఆడిస్తున్న నాటకం ఇదంతా అని, షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేస్కోవాలని సూచించారు. విజయమ్మ ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండలనుకుంటుందనుకుంటా అంటూ వీహెచ్ ఎద్దేవా చేశారు. ఇకపోతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఅర్ఎస్ నాయకులు డబ్బులతో గెలవాలని చూస్తున్నారని, విచ్చల విడిగా మద్యం, డబ్బు ప్రవాహం నడుస్తోందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే జానారెడ్డి గెలుపు ఖాయమని వీహెచ్ చెప్పుకొచ్చారు.