రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే నేను పార్టీలో ఉండను.. తేల్చిపారేసిన వీహెచ్..!

Friday, December 25th, 2020, 11:35:59 PM IST

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి కనుక రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను అప్పచెబితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని వీహెచ్ తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెడితే తనతో పాటు చాలా మంది నేతలు పార్టీనీ వీడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు.

అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు టీపీసీసీ చీఫ్ పదవికి పనికిరారా అని ప్రశ్నించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఆ పార్టీని నిలువునా ముంచేసి కాంగ్రెస్ పార్టెలొ పార్టీలో చేరారని అలాంటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీనీ కూడా ఖతం చేస్తాడని వీహెచ్ ఆరోపణలు చేశారు.