కార్పోరేట్ వర్గాలకే ప్రధాని.. మోదీపై వీహెచ్ కామెంట్స్..!

Friday, September 25th, 2020, 05:04:20 PM IST

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ చట్టం బిల్లును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. అయితే మోదీ కార్పోరేట్ వర్గాలకే ప్రధాని అని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతుల పొట్ట కొడుతున్నారని, అలాంటప్పుడు రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ రైతుల కోసం ఎంతో చేసిందని, రైతుల కోసం తెచ్చిన కాంగ్రెస్ పథకాలను బీజేపీ హైజాక్ చేస్తుందని అన్నారు.