ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కి సోకిన కరోనా

Friday, December 18th, 2020, 05:49:10 PM IST

దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మహమ్మారి భారిన పడ్డారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కున్న ఆయన ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కి సంబంధించిన లక్షణాలు లేవు అని, ఆరోగ్యం గా ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే వైద్యుల సలహ మేరకు స్వీయ నిర్బంధం లో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వాళ్ళు, సన్నిహితంగా ఉన్నవాళ్లు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని, జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అయితే కరోనా వైరస్ సోకడం తో ఇంటి వద్ద నుండే పాలనా సంబంధమైన విషయాలను చూసుకుంటా అని అన్నారు.