బిగ్ న్యూస్: సీఎం కేసీఆర్ కి ఉత్తమ్ లేఖ… ఏమన్నారంటే!?

Wednesday, August 5th, 2020, 02:51:58 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పలు జివో లను జారీ చేస్తూ పాలన పరంగా దూసుకుపోతుంది. అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టు లను అడ్డుకోవాలి అని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు ఉత్తమ్. పొట్టిరెడ్డి పాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పతకాలను అడ్డుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం కి డిమాండ్ చేశారు.అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జివో లు జారీ చేయడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రాజెక్టు లు చేపట్టకుండా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టు లను నిలువరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా చేయని యెడల ఉమ్మడి మెహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక హైదరాబాద్ కి తాగునీటి సరఫరా పై కూడా తీవ్ర ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని లేఖ లో వివరించారు. అయితే అలా జరగకుండా ఉండటానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో లు అమలు కాకుండా చూడాలి అని సీఎం కేసీఆర్ గారికి కోరడం జరిగింది.