బిగ్ న్యూస్: సీఎం కేసీఆర్ కి ఉత్తమ్ కుమార్ బహిరంగ లేఖ

Sunday, November 15th, 2020, 09:00:09 PM IST

హైదరాబాద్ నగరం లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరద నీటితో రెండు నెలలు గా ఇబ్బందులు పడుతున్న కాలనీల పై ప్రత్యేక దృష్టి సారించాలి అని అన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజక వర్గం, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ ల్లో వరద నీటిలో వెయ్యి ఇళ్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి అని లేఖలో ఉత్తమ్ కుమార్ వివరించారు.

అంతేకాక నగరంలోని పలు ప్రాంతాల పేర్లని ప్రస్తావిస్తూ సమస్యను వివరించే ప్రయత్నం చేశారు ఉత్తమ్. అయితే అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రాలేదు అని ఉత్తమ్ కుమార్ విమర్శలు చేశారు. అయితే నగరానికి కొంత దూరం లో ఉన్న మంత్రి నియోజక వర్గంలో పరిస్తితి ఇంకా దారుణం గానే ఉంది అని తెలిపారు. అయితే తక్షణమే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటిని తొలగించడం మాత్రమే కాకుండా, నష్టాన్ని అంచనా వేసి లక్ష నుండి 5 లక్షల వరకు నష్ట పరిహారం చెల్లించాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అంతేకాక వరదల్లో ప్రాణాలను కోల్పోయిన కుటుంబీకులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ లో పేర్కొన్నారు.