టీఆర్ఎస్‌పై సీఈవోకు ఫిర్యాదు చేశాం.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు..!

Sunday, March 14th, 2021, 03:00:38 AM IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ నాయకుడు పీవీ ఫోటో వాడుకోవడం పట్ల సీఈవోకు అభ్యంతరం తెలిపామని, కాంగ్రెస్ పక్షాన సీఈవోను కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతోందని ఆరోపించారు.

అయితే ఉద్యోగుల ఓట్ల కోసమే ఎన్నికల ముందు 29 శాతం పీఆర్సీ ఇస్తామంటూ ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడిస్తేనే ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్ వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ దొంగ ఓట్లను ఏయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని, పోస్టల్ ఓట్లను పోలీసులు సేకరించి టీఆర్ఎస్‌కు వేసేలా పని చేస్తున్నారని దీనిపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.