కేసీఆర్ కి చిత్తశుద్ది ఉంటే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలి

Friday, October 2nd, 2020, 07:40:17 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యవసాయ బిల్లు లను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లులు కార్పొరేట్ మిత్రులు అయిన అంబానీ మరియు అదాని లకు మేలు చేసే ప్రక్రియ లో భాగంగానే కేంద్రం తీసుకు వచ్చింది అని తెలంగాణ టాక్స్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లులను తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ మరియు అధికార తెరాస సైతం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే మరోమారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీను సమావేశ పరిచి కేంద్రం తీసుకు వచ్చిన చట్టాలకు వ్యతిరేఖంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక రైతులకు మద్దతు ధర లభించేలా రాష్ట్రం లో ఒక కొత్త చట్టం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకోవాలను ధర్నాలు చేపడుతున్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.