బిగ్ న్యూస్: మునిసిపల్ ఎన్నికలకు ప్రజలు తెరాస కు ఘలక్ ఇవ్వనున్నారా?

Saturday, January 11th, 2020, 01:00:49 AM IST

మునిసిపల్ ఎన్నికలకు తెరాస ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే తాజాగా హైకోర్టు లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ ని కొట్టి వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఓటరు లిస్ట్, రిజర్వేషన్లు ప్రకటించకుండా షెడ్యూల్ విడుదల చేయడం పట్ల కోర్ట్ లో తెరాస ఫై పిటిషన్ వేయగా, కోర్ట్ కొట్టి వేసిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ విషయంలో తెరాస ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తుంది అన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాక్యనించారు.

ఆరేళ్ళ కాలంలో మునిసిపాలిటీలకు తెరాస చేసిందేమి లేదని ఉత్తమ్ అన్నారు. తెరాస డబ్బు ప్రవాహం తో ఈ ఎన్నికలు గెలవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. నిరుద్యోగ భృతి పట్ల విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం చేసారని వ్యాఖ్యానించారు. ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ చేయలేదని, రెండో పంటకి రైతుబంధు ఇవ్వలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు ఘలక్ ఇవ్వాలని కోరారు.