“ఎన్నికల ముందు తమాషా” అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Friday, October 30th, 2020, 04:37:26 PM IST

దుబ్బాక ఉపఎన్నిక లో తప్పక గెలవాల్సిన పరిస్తితి ప్రతి పార్టీ కి ఉందని చెప్పాలి. ఒక పక్క అధికార పార్టీ గెలిచి తన హవా ను కొనసాగించాలి అని భావిస్తుండగా, ప్రతి పక్ష పార్టీ నేతలు మాత్రం ఈసారి గెలిచి అధికార పార్టీ కి బుద్ది చెబుదాం అంటూ వరుస విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక ఈ సారి హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దుబ్బాక ఉపఎన్నిక నేపద్యం లో ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయం గా మారింది. ఎన్నికల ముందు తమాషా అంటూ పలు ప్రశ్నలు గుప్పించారు. ఇన్ని రోజులు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు అని,నిరుద్యోగులు, విద్యార్థుల ఊసే లేదు ఎందుకు అని, ఇన్ని రోజులు మొక్కజొన్న రైతులను ఆదుకోలేదు ఎందుకు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ప్రశ్నించే గొంతుక కై కాంగ్రెస్ పార్టీ ను గెలిపించండి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తెరాస మాత్రం ఉచిత విద్యుత్, నీటి సర పలు అభివృద్ధి పనులను చూపించి ఓటర్లను ఆకర్షించేందుకు సిద్దం అయింది. మరి దుబ్బాక ప్రజల తీర్పు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.