ఈ హత్యల వెనుక తెరాస హస్తం ఉంది – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Thursday, February 18th, 2021, 06:30:51 PM IST

తెలంగాణ రాష్ట్రం లో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య సంచలనం సృష్టిస్తోంది. దంపతుల హత్య ను హేయమైన చర్యగా అభివర్ణించారు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఈ హత్యల వెనుక తెరాస హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే నిందితుల పై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కేసును సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ కూడా రాస్తానని తెలిపారు.

అయితే గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. తెరాస కి అనుకూలంగా వ్యవరిస్తున్నారు అని, ఎలాంటి వారంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే దంపతుల హత్య కి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల పై 24 గంటలు లోగా చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని సూచించారు.