దుబ్బాక ఉప ఎన్నికపై ఉత్తమ్ క్లారిటీ.. కాంగ్రెస్ కూడా బరిలో..!

Friday, August 14th, 2020, 06:45:59 PM IST

దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కూడా బరిలో ఉండబోతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ వచ్చే ఎన్నికలకు బలోపేతం చేసేందుకు దుబ్బాక ఉప ఎన్నిక మంచి అవకాశమని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలిపించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ ఉప ఎన్నికకు పీసీసీ తరఫున అన్ని రకాలుగా సహకారం ఉంటుందని అన్నారు.