కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తమ్ కుమార్ డిమాండ్ ఇదే!

Saturday, August 15th, 2020, 02:27:38 PM IST

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుక సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కూడా కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి అని ప్రభుత్వాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి విషయం లో ముందుగానే ప్రభుత్వాలు మెక్కొంటే, ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావు అను ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.