కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Tuesday, September 29th, 2020, 02:07:04 AM IST


కేంద్ర ప్రభుత్వ తీరు పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీ కేంద్ర ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను మోడీ మరియు కేసీఆర్ ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దానిని నిరసిస్తూ గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించగా అనుమతి నిరాకరించిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు.

పార్లమెంట్ లో బీజేపీ పాస్ చేయించిన మూడు బిల్లులు కూడా వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టు అంటూ ఆరోపించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ బిల్లులు రైతులకు మేలు చేసేవి కావు అని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనవి అంటూ వ్యాఖ్యానించారు. ఈ చట్టంలో రైతులకు రక్షణ కల్పించే అంశాలు లేవు అని, కనీస మద్దతు ధర హామీ కూడా లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తూ, కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లులను తప్పు పడుతూనే సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ అసమర్థ తో తెలంగాణ రైతుల కి పంట భీమా లేకుండా పోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.