రాష్ట్రంలో టెస్టింగ్ కిట్లు లేకపోవడం దారుణం – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Friday, May 14th, 2021, 08:30:29 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మేరకు రాష్ట్రం లో కరోనా వైరస్ కట్టడి విషయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే కరోనా వైరస్ విజృంభిస్తోంది అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలంగాణ లో ఆర్టీపిసిఆర్ నిర్దారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అయితే రాష్ట్రం లో టెస్టింగ్ కిట్లు లేకపోవడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా పై రాష్ట్రం లో ఎలాంటి నియంత్రణ లేదని అన్నారు. అయితే చాలా చోట్ల కరోనా వైరస్ టెస్టుల కోసం అయిదారు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు.

అయితే వచ్చిన వారి లో వంద మంది కి మాత్రమే కరోనా వైరస్ వాక్సిన్ వేసి పంపిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ లో 104, 108 సేవలను నిర్వీర్యం చేసింది అని మండిపడ్డారు. అంతేకాక హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ లో ఇప్పటి వరకూ కోవిడ్ ను చేర్చలేదు అని, ప్రజారోగ్యం పై ప్రభుత్వం కి ధ్యాస లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలను కోల్పోతే సీఎం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల అధికార తెరాస కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.