రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది – ఉత్తమ్ కుమార్

Thursday, August 27th, 2020, 12:31:00 AM IST


తెలంగాణ రాష్ట్రం లో తెరాస పాలన విధానం పై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాలన విధానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని విధాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని, ప్రజల్లో తెరాస పై వ్యతిరేకత ఏర్పడుతుంది అని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. కరోనా వైరస్ క్లిష్ట సమయంలో డీసీసీ లు ప్రజలకు, వలస కార్మికులకు సేవ చేయడం లో ముందు ఉండి నడిపించారు అని ఉత్తమ్ ప్రశంసలు కురిపించారు. అయితే డీసీసీ పదవుల్లో కొందరికి అన్యాయం జరిగినప్పటికీ వారు అంతా పార్టీ కోసం సేవ చేశారు అని అన్నారు.

అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను అరికట్టడం లో ప్రభుత్వం విఫలం అయింది అని, కరోనా వైరస్ ద్వారా మరణించిన వారిని ఇతర రోగాల ద్వారా మరణించినట్లుగా అబద్ధాలు చెబుతున్నారు అని ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రోజువారీగా కరోనా కేసులను, మరణాలను కూడా దాస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదు అని అన్నారు. అంతేకాక కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కి ఉన్న సమస్య ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. శ్రీశైలం దుర్ఘటన కి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.