దుబ్బాక లో తెరాస ను ఒడిస్తే కేసీఆర్ కి హామీలన్నీ గుర్తుకు వస్తాయి – ఉత్తమ్ కుమార్

Sunday, October 25th, 2020, 09:38:45 AM IST

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై, కేసీఆర్ తీరు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక లో తెరాస ను ఒడిస్తేనే కేసీఆర్ కి హామీలు అన్ని గుర్తుకు వస్తాయి అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొంటాం అని, ఉద్యోగులకు డి ఎ ఇస్తామని ప్రకటించడం దుబ్బాక ప్రజల నైతిక విజయం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మొన్నటివరకు కుక్కతోక అంటూ అవహేళన చేసిన కేసీఆర్ నేడు డీ ఏ ప్రకటించారు అని గుర్తు చేశారు ఉత్తమ్ కుమార్.

అయితే మొక్కజొన్న పంటలే వేయోడ్డు అని 1200 రూపాయలకు దేశమంతా దొరుకుతున్నాయి అని మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మద్దతు ధర 1,850 పెట్టి కొంటాం అని అంటున్నారు అని తెలిపారు. అయితే ఉద్యోగులకు, రైతులకు హామీలు ఇచ్చిన కేసీఆర్, దుబ్బాక లో ఓడగొడితే ఇక అన్ని చేస్తారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆరోగ్య శ్రీ, ఇంటికో ఉద్యోగం, ముస్లిం, గిరిజనులకు రిజర్వేశన్లతో పాటుగా విద్య అన్ని వస్తాయి అంటూ పలు హామీల పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.