ఓటమితో భయంతో రఘునందన్, హరీశ్ రావు లు కాంగ్రెస్ పార్టీ పై విష ప్రచారం చేస్తున్నారు

Tuesday, November 3rd, 2020, 01:46:31 PM IST

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ఉపఎన్నికలో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, తెరాస ల మద్య జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ తెరాస పై, మరియు బీజేపీ నేత రఘునందన్ పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెరాస లోకి వెళ్తున్నాడు అంటూ పోలింగ్ మొదలైనప్పటి నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడిషనల్ సీఈఓ ను ఉత్తమ్ తో సహా పలువురు నాయకులు కలిసి ఈ విషయం పై ఫిర్యాదు చేశారు. అయితే తమ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ఒక వీడియో చెక్కర్లు కొడ్తుంది అని, దానిపై చర్యలు తీసుకోవాలని, డీజీపీ ను, అడిషనల్ సీఈఓ ను కలిశామని వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

అయితే ఓటమి భయం తో రఘునందన్ మరియు హరీశ్ రావు లు కాంగ్రెస్ పార్టీ పై విష ప్రచారం చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కి చెందిన వారు అని, తెరాస నుండి వచ్చిన వ్యక్తి రఘునందన్ అని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారిని పోలింగ్ పూర్తి అయ్యేలోపు అరెస్ట్ చేయాలని డీజీపీ ను కోరాం అని, ఆ వీడియో ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.