మంత్రి హరీశ్, బీజేపీ అభ్యర్థి రఘునందన్ తోడు దొంగలు – ఉత్తమ్ కుమార్

Thursday, October 29th, 2020, 10:15:15 AM IST

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం రసవత్తరం గా మారింది. అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు బీజేపీ అధ్యక్షుడు రఘునందన్ పై మంత్రి హరీశ్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ తోడు దొంగలు అంటూ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. వారిద్దరు కూడా బంధువులే అని, ఓటర్లను ఆగం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ కి ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఓటర్లను తికమక పెట్టేందుకు వారు ఇద్దరూ కలిసి అధ్బుతమైన స్క్రిప్ట్ తయారు చేశారు అంటూ ఆరోపణలు చేశారు.ప్రజలు ఎవరూ కూడా గందరగోళం పడాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థ పై అత్యాచారం కేసులు ఉన్నాయి అని, అటువంటి వ్యక్తి కి ఓట్లు ఎలా వేస్తారు అని అన్నారు. ఆయన విపరీతంగా డబ్బులు పంచుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కళ్ళు చెప్పి అని చెప్పుకోవడం తప్ప హరీశ్ రావు చేసిందేమీ లేదు అని విమర్శించారు.