ఆ విషయం లో సీఎం కేసీఆర్ వైఫల్యం చెందారు – ఉత్తమ్ కుమార్

Friday, August 7th, 2020, 10:19:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారు అని కాంగ్రెస్ పార్టీ నేత, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.అయితే నేడు పార్టీ కీలక నేతలతో జూమ్ ఆప్ ద్వారా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ ఈ విషయం లో సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయం లో కేసీఆర్ మౌనం వెనుక కుట్ర దాగి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు హజరు కాలేదు అని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ హజరు కాకపోవడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సుప్రీం కోర్టు లో వేసినటువంటి పిటిషన్ లో ఎత్తిపోతల ను ఆపే ఒక్క అంశమే లేదు అని అన్నారు. అయితే పిటిషన్ లో కర్ణాటక, మహారాష్ట్ర లను ఎందుకు చేర్చారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు.