సీఎం కేసీఆర్ పాలన పై, తెలంగాణ పోలీసుల పై ఉత్తమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Sunday, September 6th, 2020, 09:50:39 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ పై తరచూ విమర్శలు చేసే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి అధికార పార్టీ తీరు పై ఘాటు విమర్శలు చేశారు. పోలీసులు ప్రవర్తిస్తున్న విధానం కూడా సరైనది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో పోలీసులు వన్ సైడ్ గా పని చేస్తున్నారు అని తెలిపారు. అంతేకాక ప్రతి పక్షాన్ని తొక్కేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారు అని ఆరోపించారు. అయితే డీసీసీ అధ్యక్షులు అంశాల వారీగా పోటీ చేయాలి అని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం లో ప్రజలకి తలెత్తుతున్న సమస్యల పై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలి అని అన్నారు. అంతేకాక గత ఎన్నికల్లో తెరాస కి అండగా నిలిచిన వారే, నేడు తమ వైపుకి వస్తున్నారు అని, అంతేకాక వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ వైపుకి వస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపిన ఉత్తమ్, పార్టీ ను మరింత బలోపేతం చేసేందుకు సిద్దం కావాలని అన్నారు. అంతేకాక పార్టీ బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 మరియు 18 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి అని తెలిపిన ఉత్తమ్, ప్రస్తుతం కేసీఆర్ పాలన పై అసంతృప్తి వ్యక్తం అవుతుంది అని అన్నారు.కేసీఆర్ పాలన లో అవినీతి కి ఆస్కారం ఇస్తోంది అని, ఎన్నికల్లో అవినీతి సొమ్ము విచ్చలవిడి గా ఖర్చు చేస్తోంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.