కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు – ఉత్తమ్ కుమార్

Tuesday, October 6th, 2020, 10:57:54 PM IST


తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక అంశం పై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం లో టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక కి సంబంధించిన అభ్యర్థి పేరు హై కమాండ్ పరిశీలన లో ఉంది అని తెలిపారు. అభ్యర్థి పేరును రేపు ప్రకటిస్తాం అని అన్నారు. అయితే ఈ దుబ్బాక ఉపఎన్నిక ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీక కుటుంబ ఎన్నికగా దుబ్బాక ఉపఎన్నిక కి నేతలు సహకరించాలని కోరారు.

అయితే 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచం లో ఎక్కడా లేని అవినీతి చోటు చేసుకుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం నుండి వీఆర్వో వరకు ప్రతి ఒక్కరూ కూడా దోచుకుంటున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం ను భ్రష్టు పట్టించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డబ్బు ఎవరు పంచినా కూడా కాంగ్రెస్ కే ఓటు వేయాలని కోరారు. అయితే తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారా, అన్యాయం చేశారా అనేది ఈ ఎన్నికతో తేలిపోవాలని అన్నారు.

అయితే రేపటి నుండి దుబ్బాక లోనే ఉంటా అని ఉత్తమ్ కుమార్ తెలిపారు. అంతేకాక ఎల్ ఆర్ ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం మోసం చేస్తోంది అని, పైసలు ఎవరూ కట్టోద్దు అని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఫ్రీ గా చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.