తెరాస ఏడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు – ఉత్తమ్ కుమార్

Saturday, October 17th, 2020, 07:23:04 AM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ తీరు పై విపక్షాలు, విపక్షాల పై తెరాస నేతలు ఒకరి పై మరోకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో తాము విజయం సాధించి రాష్ట్రానికి కొత్త సంకేతం పంపుతాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఎన్నికల హామీలను తెరాస నెరవేర్చలేదు అని, అందుకే దుబ్బాక ఉపఎన్నిక కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు అని అన్నారు.

అయితే దుబ్బాక నియోజక వర్గం లోని పలు కీలక నేతలతో చర్చించిన అనంతరం ఉత్తమ్ మీడియా సమావేశం లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస ఏడేళ్ల పాలన లో రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమే లబ్ది పొందింది అని విమర్శించారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పై సైతం విమర్శలు చేశారు. దీని పేరిట ప్రజల నడ్డి విరిచే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది అని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక, ప్లాట్లను ఉచితంగా క్రమబద్దీకరిస్తాం అని తెలిపారు.