కరోనా టీకా తీసుకున్న జో బైడెన్…ప్రజలు కూడా సన్నద్ధంగా ఉండాలి!

Tuesday, December 22nd, 2020, 08:30:37 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు. డెలవర్ లోని క్రిస్టియానా ఆసుపత్రి లో జో బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోస్ తీసుకోవడం జరిగింది. అయితే టీకా తీసుకున్న పూర్తి వీడియో ను మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీకా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే ప్రజల్లో అపోహ తొలగించేందుకు టీకా వేసుకుంటున్నా అని, టీకా వేసుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి అని సూచించారు. అయితే తను టీకా రెండో డోస్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అమెరికా లో ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై వేల మంది వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే క్రిస్మస్ వేడుకలు సమీపించడం తో అందరూ కూడా భౌతిక దూరం పాటించడం మరియు మాస్క్ లు ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి జో బైడెన్ సూచించారు.