‘ఆల్ఫాబెట్’ ను ప్రారంభించిన గూగుల్!

Tuesday, August 11th, 2015, 12:18:38 PM IST


ఇంటర్నెట్ సెర్చింజన్ గా సేవలు ప్రారంభించిన దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా ‘ఆల్ఫాబెట్’ పేరిట కొత్త సంస్థను ప్రారంభించింది. కాగా వినూత్న ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేసే నిమిత్తం గూగుల్ ఈ సంస్థను ప్రారంభించింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ లారీ పేజ్ వ్యాఖ్యానిస్తూ ‘అల్ఫాబెట్ పేరిట కొత్త జీవితం ప్రారంభమైంది. నాకు, సెర్గీకి ఇది ఎంతో ఆనందకరమైన రోజు’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆల్ఫాబెట్ అన్న పేరు తమకెంతో బాగా నచ్చిందని, ఆల్ఫాబేట్ అంటే కొన్ని అక్షరాల సముదాయమని, ఒక భాషను సూచిస్తుందని, మానవులు కనుగొన్న అత్యంత వినూత్న అంశాలలో ఇది ఒకటని, అందుకే ఈ సంస్థకు ఈ పేరు పెట్టామని లారీ పేజ్ తెలిపారు. ఇక 1998లో సెర్చ్ వ్యాపారానికి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న సెర్గీ బ్రిన్ తో కలిసి తాను ఈ కొత్త సంస్థను ప్రారంభించనున్నామని లారీ పేజ్ తెలిపారు.