నేడు సాయంత్రం విడుదల కానున్న ఉప్పెన టీజర్

Wednesday, January 13th, 2021, 01:40:47 PM IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా, కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రం 2020 లో విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణం గా, లాక్ డౌన్ అమలు కారణం గా చిత్రం వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని ఎట్టకేలకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నేడు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

సాయంత్రం 4:05 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పలు పోస్టర్లు, పాటలు ఇప్పటికే యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హీరో, హీరోయిన్ లకు ఈ చిత్రం మొదటి దే అయినా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం ను అందించడం, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి భాగస్వామిగా ఉండటం మాత్రమే కాకుండా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పాలి. బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఏ చిత్రం ను సమ్మర్ కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.