‘ఉప్పెన’ సన్నాహాలు మొదలయ్యాయి

Tuesday, January 12th, 2021, 04:24:18 PM IST

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తగా కుర్రాడు వైష్ణవ్ తేజ్. ఆయన చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్టుమెంట్లో వర్క్ చేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను సుకుమార్ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగియగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పూర్తయ్యాయి. కానీ లాక్ డౌన్ కారణంగారిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది.

ఎట్టకేలకు మళ్ళీ థియేటర్లు తీర్చుకోవడం, ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తుండటంతో నిర్మాతలు రిలీజ్ పనులు మొదలుపెట్టారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో సినిమా విడుదలకానుంది. ఈలోపు టీజర్ రిలీజ్ సిద్ధం చేస్తున్నారు టీమ్. త్వరలోనే టీజర్ ఎప్పుడో టైమ్ చెప్పనున్నారు. మోస్ట్లీ సంక్రాతి కానుకగా టీజర్ విడుదల ఉండొచ్చు. థియేటర్లు తెరుచుకోకపోవడంతో మొదట్లో ఓటీటీకి వెళదామని నిర్మాతలు అనుకున్నా వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం కాబట్టి థియేటర్లోకే రావాలని నిర్ణయించుకుని ఇంతకాలం ఆగారు టీమ్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.