ఆకట్టుకుంటున్న ఉప్పెన ట్రైలర్…”ప్రేమంటే లైలా మజ్నులా అంటూ…”

Thursday, February 4th, 2021, 04:54:23 PM IST

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరొక హీరో పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయింది. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 12 న థియేటర్ల లోకి అడుగు పెడుతోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పాటలు, పోస్టర్లు, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కి ఊహించని విధంగా ఒక హైప్ క్రియేట్ అయ్యింది.

అయితే నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) చేతుల మీదుగా విడుదల అయిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ స్టార్ట్ అవుతూనే ప్రేమంటే ఓ లైలా మజ్ను లా అంటూ ఒక డైలాగ్ తో సాగుతూ ఉంది. ఈ ట్రైలర్ లో హీరో హీరోయిన్ ప్రేమ కథ తో పాటుగా, పెద్దలకు ప్రేమ పై ఉండే పగ ను కూడా చక్కగా కనబరిచారు. విజయ్ సేతుపతి ఈ చిత్రం లో కృతి శెట్టి కి తండ్రి పాత్రలో, విలనిజం కనబరుస్తూ నటించారు. చివరగా ట్రైలర్ లో వచ్చే ప్రేమ గొప్పదైతే చరిత్ర లోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ అంటూ వచ్చే డైలాగ్ తో ఎండ్ అవుతుంది. ఈచిత్రం ట్రైలర్ అనుకున్న విధంగా ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ లు ఇరువురు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.