ఫ్రెష్ కంటెంట్ తో ఉప్పెన టీజర్

Wednesday, January 13th, 2021, 04:37:38 PM IST

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఉప్పెన చిత్రం టీజర్ విడుదల అయింది. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఏడాది కాలం నుండి ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ నేడు విడుదల అయింది. అయితే టీజర్ మొత్తం కూడా చాలా ఫ్రెష్ కంటెంట్ తో నిండి ఉంది. ఈ చిత్రం తో మరొక ప్రేమకథ ప్రేక్షకులను తప్పక అలరించనున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. టీజర్ లోని డైలాగ్స్, మాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అని చెప్పాలి.

ఈ చిత్రం గతేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉండగా, కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్.