సమీక్ష: ఉప్పెన

Friday, February 12th, 2021, 02:01:51 PM IST

థియేటర్ల లో నేడు విడుదల అయిన చిత్రాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న చిత్రం ఉప్పెన. ఎంతో హైప్ సృష్టించిన ఈ చిత్రం అందుకు అనుగుణంగా ఉందో లేదో చూద్దాం.

కథ:

ఆశి (వైష్ణవ్ తేజ్) మరియు బేబీ (కృతి శెట్టి) లు ఒకే గ్రామంలో రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందినవారు. వీరిద్దరూ ప్రేమ లో పడతారు, అయితే బేబీ తండ్రి ఆయిన విజయ్ సేతుపతి వీరి ప్రేమకు అడ్డు పడతారు. అయితే ఈ ప్రేమ జంట పారి పోయి ఎలాంటి ఉద్రిక్తతలను సృష్టిస్తారు మరియు ఎలా తత్తుకుంటారు అనేది ఉప్పెన కథ.

విశ్లేషణ:

ఈ మొత్తం చిత్రం కథ ఒక చిన్న పట్టణం లో సెట్ చేయబడింది. టీజర్ లలో చూపించినట్లు గా ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి, ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి గురించి. అయితే ఈ చిత్రం లో ప్రత్యేక పాత్ర విజయ్ సేతుపతి ద్వారా సినిమా ప్రారంభంలోనే ఈ పాత్రలు అన్ని కూడా ఒక ప్రత్యేకత తో మొదలు అవుతాయి. అయితే ఈ చిత్రం లో బాగా ఆకర్షించేది ముఖ్యంగా హీరో హీరోయిన్ ల జంట, వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ. వారి మధ్య లో వచ్చే పాటలు, రొమాన్స్ చాలా ఆకట్టుకున్నాయి.

అయితే తన తొలి చిత్రం తోనే దర్శకుడు బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్ ను చక్కగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీశారు. అయితే ఈ చిత్రం రొటీన్ గా సాగుతోంది అనుకునే సమయానికి చివర్లో ఒక సస్పెన్స్ తో మంచి ట్విస్ట్ తో సినిమా ను చుట్టెయ్యడం జరుగుతుంది. ఈ చిత్రం లో మంచి డ్రామా కలిగి ఉంది. కాకపోతే కొన్ని రొటీన్ సన్నివేశాలు కూడా కథలో ఉన్నాయి. ప్రధానంగా ఈ చిత్రం లో వారిద్దరీ నటన అద్భుతం అని చెప్పాలి. తొలి సినిమా తోనే అద్భుతమైన నటన తో ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్:

అద్భుతమైన సంగీతం
హీరో, హీరోయిన్ల నటన
లోకేషన్స్
మాటలు
హీరో, హీరోయిన్ల రొమాన్స్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్
నీరసంగా సాగే విజయ్ సేతుపతి
పారిపోయే రొటీన్ ప్రేమ సన్నివేశాలు

తీర్పు:

ఉప్పెన చిత్రం రొటీన్ కథ అయినప్పటికీ తెరకెక్కించిన విధానం బాగుంది. డైరెక్షన్, పాటలు మరియు నటీనటులు నటన చాలా ఆకట్టుకుంటాయి. కొంచెం స్లో గా సాగే కథ ను విస్మరిస్తే చూడటానికి ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5