ఎంతో కంగారుతో వెళ్లి మెగాస్టార్ ను కలిశాను – ఉప్పెన డైరెక్టర్

Monday, February 8th, 2021, 04:30:12 PM IST

సినిమా పై ఉన్న అమితాసక్తి తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మరొక కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఉప్పెన చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు తాజాగా ఆమె ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. సుకుమార్ వద్ద ఎన్నో విషయాలను నేర్చుకున్నా అని, ఏదైనా మంచి ప్రేమ కథ ను తెరకెక్కించాలి అని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే రంగస్థలం సినిమా షూటింగ్ సమయం లో ఉండగా, ఉప్పెన చిత్రం గురించి ఆలోచన వచ్చింది అని, అయితే ఈ పూర్తి విషయాన్ని సుకుమార్ కి చెప్తే చాలా బాగుంది, స్టోరీ, స్క్రీన్స్ ప్లే పై పని చెయ్ అని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఆరు నెలల సమయం తీసుకొని పూర్తి కథ సిద్దం చేసి మళ్ళీ సుకుమార్ కి వినిపించా అని అన్నారు. తనను గట్టిగా కౌగిలించు కొని, సూపర్ గా ఉంది, నువ్వు నా పెద్ద కొడుకివి రా అంటూ సుకుమార్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. అయితే హీరో కోసం వెతికే సమయం లో తన స్నేహితుడు ఒకతను వైష్ణవ్ తేజ్ ఫోటో ను చూపించాడు అని అన్నారు. అయితే అతను మెగా కాంపౌండ్ నుండి వచ్చే వ్యక్తి కావడం, కొత్త దర్శకుడు కి అవకాశం ఇస్తారా అని అనుకున్నా అంటూ వివరించారు. అయితే వైష్ణ వ్ ను కలిసి కథ చెప్పాక నటన పై ఆసక్తి లేదు అని, ఆర్మీ పై ఆసక్తి అంటూ వైష్ణవ్ అన్న విషయాలను వెల్లడించారు. అయితే నటన గురించి ఏమీ నేర్చుకోలేదు అని, కాకపోతే కథ బావుంది అన్నారు అని అన్నారు. అయితే చిరు కి కథ చెప్పాల్సి రావడం తో వారం రోజులు సిద్దం అయినట్లు తెలిపారు. ఎంతో కంగారు తో మెగాస్టార్ ను కలిసిన విషయాన్ని వెల్లడించారు. అయితే గంటపాటు కథ వివరించిన అనంతరం బాగుంది అని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.