ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలలో ఇకపై డిజిటల్ పేమెంట్స్..!

Monday, August 17th, 2020, 04:14:50 PM IST

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలో సరికొత్త సేవలు ప్రారంభమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన UPI ఆధారిత పేమెంట్ గేట్‌వే వ్యవస్థను నేడు ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

కెనరా బ్యాంకు, ఎన్‌పీసీఐ సహకారంతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలలో UPI సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అత్యంత సులభంగా, సురక్షితంగా, వెంటనే చెల్లింపుల ప్రక్రియ జరిగేలా డిజిటల్‌ సేవలు పనిచేస్తాయని, క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుందని తెలుస్తుంది.