మంత్రి వ్యాఖ్యలతో సిఎం కలత.. వేటు..!

Friday, December 25th, 2015, 12:00:12 PM IST

దేశంలోని ముస్లింలు హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించాలని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఓంపాల్ నెహ్రా వ్యాఖ్యలు చేశారు. నెహ్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఇక, ఈ వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మందిపడటమే కాకుండా.. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికేంతగా నెహ్రా ఏం వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం.

దేశంలోని ముస్లింలు హిందుదేవాలయాల పునరుద్దరణ విషయంలో సహకరించాలని.. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో కూడా ముస్లింలు హిందువులకు సహకరించాలని అన్నారు. కరసేవలో స్వచ్చందంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొనాలని.. అలాగే మధురలో కృష్ణమందిరానికి ముస్లింలు మద్దతు పలకాలని ఆయన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నెహ్రా వ్యాఖ్యలతోటి ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన ముఖ్యమంత్రి వెంటనే ఓంపాల్ నెహ్రాను పదవి నుంచి తొలగించారు.