కరోనా సోకి మృతి చెందిన మంత్రి… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం!

Sunday, August 2nd, 2020, 03:19:43 PM IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే భారీగా నమోదు అవుతున్న కేసుల పట్ల ప్రజలు ఆందోళన చెందుతుండగా, ప్రజా ప్రతినిదులు సైతం కరోనా వైరస్ భారిన పడటం భయాందోళన లకు గురి చేస్తోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ కేబినెట్ మంత్రి కమల్ రాని వరుణ్ కరోనా సోకి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా లక్నో లో ఒక ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఆమె నేడు తుది శ్వాస విడిచారు. అయితే ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ రావడం, దాని కారణం గా ఆరోగ్యం క్షీణించింది అని వైద్యులు తెలిపారు. ఎంతగా ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేక పోయాం అని వైద్యులు సైతం అవేదన వ్యక్తం చేశారు.

అయితే నేడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ అయోధ్యా రామ మందిర నిర్మాణం కి సంబంధించిన పూజ ఏర్పాటు లను చేసేందుకు వెళ్లాల్సి ఉండగా, మంత్రి మృతి కారణంగా ఆ కార్యక్రమం ను రద్దు చేసుకున్నారు. ఆమె మృతి పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యం లో మంత్రి మరణించిన వార్త ప్రజలను మరింత ఆందోళన కి గురి చేస్తోంది.