బిగ్ న్యూస్: అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Friday, October 9th, 2020, 06:28:46 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ లాక్ 5.0 కి సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల వలన ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. అయితే కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ 5.0 కి సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేయడం జరిగింది.

రద్దీగా ఉండే ప్రదేశాల్లో భౌతిక దూరం తప్పనిసరి గా పాటిస్తూ, మాస్క్ లను విధిగా ధరించాలి అని పేర్కొంది. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ప్రజా రవాణాలో కరోనా వైరస్ నిబంధనలను పాటించాలి అని, ప్రార్ధనా మందిరాల్లో కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని తెలిపింది.

మాస్క్ లేకుండా రద్దీ గా ఉన్న ప్రదేశాలకు అనుమతి నిరాకరించాలి అని, అంతేకాక కరోనా నిబంధనలు అమలు అయ్యేలా బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో ప్రత్యేక అధికారులను ఉంచడం మాత్రమే కాకుండా, మైక్ లలో అనౌన్స్ మెంట్ చేయాలని తెలిపారు. అంతేకాక కరోనా వైరస్ కి సంబంధించిన ప్రతి విషయం లో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని తెలిపింది.