సజీవ దహనం చేస్తాం.. కత్తి కార్తికను బెదిరించిన నలుగురు వ్యక్తులు..!

Friday, September 18th, 2020, 08:32:32 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. హైదరాబాద్ నుండి దుబ్బాక వైపు వస్తున్న కత్తి కార్తీకను రామాయంపేటలోని అడిగాస్ హోటల్ దగ్గర మరో కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తి కార్తీక కారును అడ్డగించారు. సజీవంగా కాల్చి బూడిద చేస్తామని తనను బెదిరించి బూతులు తిడుతూ వెళ్ళిపోయారని రామయంపేట పోలీస్ స్టేషన్‌లో కత్తి కార్తీక ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో స్వతంత్ర అభ్యర్థిగా కత్తి కార్తీక పోటీ చేయబోతుంది. సిద్దిపేట జిల్లా బీసీ (గౌడ) సామాజికవర్గానికి చెందిన కత్తి కార్తీక ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టింది.