యాక్షన్ కింగ్ మోహన్ బాబుకు దుండగుల వార్నింగ్..!

Sunday, August 2nd, 2020, 12:42:06 AM IST


సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ మోహన్ బాబుకు కొందరు దుండగులు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మోహన్ బాబు ఫాంహౌజ్ ఈ ఘటన జరిగింది.

అయితే పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని ఫాంహౌజ్‌లోకి ఓ గుర్తు తెలియని కారు దూసుకెళ్ళింది. అనంతరం కారులోని దుండగులు మిమ్మల్ని వదలమంటూ హెచ్చరించి వెళ్ళిపోయారు. దీంతో భయానికి గురైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారులో నలుగురు దుండగులు వచ్చినట్టు తెలుస్తుండగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.