మంచు ముసుగులో అమెరికా!

Thursday, November 27th, 2014, 12:20:23 PM IST


అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. కాగా మంచు తుఫాను కారణంగా అమెరిక తూర్పు తీరంలోని పలు విమానాశ్రయాలలో వెయ్యికి పైగా విమానాలను నిలిపివేశారు. ఇక మరో 5వేలకు పైగా విమానాలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే తుఫాను ప్రభావంగా న్యూయార్క్ రహదార్లపై 4అంగుళాల మేరకు మంచు పేరుకు పోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక అదే శివారు ప్రాంతాలలో అయితే దాదాపు 10 అంగుళాల మేరకు మంచు పేరుకోవచ్చునని భావిస్తున్నారు. కాగా ఈ తుఫాను ప్రభావం దాదాపు 2కోట్ల మంది ప్రజలపై పడనుందని తెలుస్తోంది. కాగా ప్రయాణాలు చేసే వారు తమ జర్నీని వాయిదా వేసుకోవాల్సిందిగా జాతీయ వాతావరణ కేంద్రం విజ్ఞ్యప్తి చేసింది.