బ్రేకింగ్: కరోనా వైరస్ తో మృతి చెందిన కేంద్ర మంత్రి!

Wednesday, September 23rd, 2020, 09:25:52 PM IST

కరోనా వైరస్ తో పోరాడుతూ కేంద్ర మంత్రి సురేష్ అంగాడి మృతి చెందారు. కరోనా వైరస్ మహమ్మారి తో బాధపడుతున్న మంత్రి, గత కొద్ది రోజులుగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే కేంద్ర మంత్రి సురేష్ అంగాడి రైల్వే శాఖ సహాయ మంత్రి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన మరణించినట్లు అధికారులు సైతం ధృవీకరించారు. అయితే కర్ణాటక లోని బెళగావి నుండి ఆయన లోక్ సభ స్థానం నుండి గెలవడం జరిగింది.

గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ తీవ్రత భారత్ లో ఎక్కువగా ఉంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేత కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పుడు మరొక కేంద్ర మంత్రి మృతి చెందడం పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.