దుబ్బాక, జీహెచ్ఎంసి లో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

Friday, December 11th, 2020, 01:09:30 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అధికార తెరాస, ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల పై విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అయితే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి అని కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన, అవినీతి పై రాష్ట్ర ప్రజలు అసంతృప్తి తో ఉన్నారు అని ఆరోపించారు. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ కారుల ఆకాంక్ష ను బీజేపీ నేర వేరుస్తుంది అని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి అని తెలిపారు. అయితే కొత్త సాగు చట్టాల్లో రైతులకు ఒక్క అంశం కూడా వ్యతిరేకంగా లేదు అని అన్నారు. పంజాబ్ లో తప్ప మిగతా ఎక్కడా రైతులు వ్యతిరేకించడం లేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.